వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేసీఆర్ ప్రసంగం | kcr attends at world economic forum | Sakshi
Sakshi News home page

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేసీఆర్ ప్రసంగం

Sep 9 2015 3:19 PM | Updated on Aug 15 2018 9:30 PM

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేసీఆర్ ప్రసంగం - Sakshi

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేసీఆర్ ప్రసంగం

భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ గొప్పగా పనిచేస్తోందని, దేశాభివృద్ధిలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.

బీజింగ్: భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ గొప్పగా పనిచేస్తోందని, దేశాభివృద్ధిలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. చైనాలో పర్యటిస్తున్న కేసీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. భారత్లో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని, అభివృద్దిలో నూతన శిఖరాలను అధిరోహించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు.

పారిశ్రామిక అనుమతుల కోసం తెలంగాణలో ఐపాస్ రూపంలో గొప్ప పాలసీని ప్రవేశపెట్టామని కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో చట్టాన్ని తెచ్చి రెండు వారాల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి విషయంలో ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని, సంస్కరణల విషయంలో ప్రధాని మోదీ గట్టిగా పనిచేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement