ఆ స్థలం జూబ్లీహిల్స్ సొసైటీదే | Jubilee of the Society of the site | Sakshi
Sakshi News home page

ఆ స్థలం జూబ్లీహిల్స్ సొసైటీదే

Oct 5 2015 3:32 AM | Updated on Sep 3 2017 10:26 AM

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చౌరస్తాలో తాను సొసైటీ నుంచి 59 ఏళ్ల లీజుకు స్థలాన్ని తీసుకున్నానని, ఈ స్థలంతో మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబానికి ఎలాంటి

♦ నేను లీజుపై తీసుకున్నా.. డీకే కుటుంబానికి సంబంధం లేదు
♦ పెట్రోల్ బంక్ యజమాని సునీల్‌కుమార్
 
 సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చౌరస్తాలో తాను సొసైటీ నుంచి 59 ఏళ్ల లీజుకు స్థలాన్ని తీసుకున్నానని, ఈ స్థలంతో మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని పెట్రోల్ బంక్ యజమాని సునీల్‌కుమార్ తెలిపారు. తాను 1987లో జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకున్నానని, ఈ మేరకు పలు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ఇదే విషయమై మాజీ మంత్రి డీకే అరుణ ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం సమీప బంధువు భవనానికి విలువ పెంచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కూల్చివేశారని, ఆపై సదరు భూమి డీకే అరుణకి చెందినది అంటూ మీడియాకు లీకులిచ్చారని మండిపడ్డారు. సునీల్‌కుమార్‌తో తమ కుటుంబానికి పరిచయం మాత్రమే ఉందని, పరిచయం ఉన్న వారి ఆస్తులు, తమవి ఎలా అవుతాయో ప్రభుత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement