హోంవర్క్ చేయలేదని కొడుకును చంపాడు | Japanese father stabs son to death for not doing homework | Sakshi
Sakshi News home page

హోంవర్క్ చేయలేదని కొడుకును చంపాడు

Aug 24 2016 5:06 PM | Updated on Aug 16 2018 4:31 PM

హోంవర్క్ చేయలేదని కొడుకును చంపాడు - Sakshi

హోంవర్క్ చేయలేదని కొడుకును చంపాడు

ప్రైవేట్ స్కూలులో ప్రవేశ పరీక్షకు కొడుకు ప్రిపేర్ కాలేదని కోపంతో జపాన్కు చెందిన కెంగొ సటకె (48) ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

కన్నతండ్రి అనే విషయాన్ని మరిచి రాక్షసుడిలా ప్రవర్తించాడు. చిన్న కారణానికి 12 ఏళ్ల కొడుకుని కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. ప్రైవేట్ స్కూలులో ప్రవేశ పరీక్షకు కొడుకు ప్రిపేర్ కాలేదని కోపంతో జపాన్కు చెందిన కెంగొ సటకె (48) ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

హోంవర్క్ చేయడం లేదని కొడుకు ర్యోటా సటకెపై సటకె ఆగ్రహం చెందాడు. కూరగాయలు కోసే కత్తి తీసుకుని కొడుకు ఛాతీపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి కెంగోను అరెస్ట్ చేశారు. పొరపాటును కత్తితో దాడి చేశానని కెంగో చెప్పాడు. ఆ సమయంలో తన భార్య పనిలో ఉందని, నిగ్రహం కోల్పోయి తప్పు చేశానని అన్నాడు. స్కూల్ అడ్మిషన్ పొందేందుకు కష్టపడి చదవడంలేదంటూ కెంగో చాలాసార్లు కొడుకును హింసించాడని స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement