ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ముఫ్తీ | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం

Published Thu, Jun 30 2016 3:01 PM

Jammu and Kashmir Chief Ministe Mehbooba Mufti sworn in as MLA

శ్రీనగర్ : పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ కవీంద్ర గుప్తా ...ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 25న జరిగిన అనంత నాగ్ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఫ్తీ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హిలాల్ అహ్మద్ షాపై 12,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

దివంగత ముఖ్యమంత్రి, ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ మృతితో అనంతనాగ్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మెహబూబా ముఫ్తీ ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  అనంతరం అనంతనాగ్ లోక్ సభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. దాంతో లోక్ సభ నియోజకవర్గంలో తాజాగా ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement