క్షమాపణ చెప్పిన హీరో కొడుకు | Jackie Chan's son says sorry for drug case | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పిన హీరో కొడుకు

Aug 20 2014 2:43 PM | Updated on May 25 2018 2:45 PM

క్షమాపణ చెప్పిన హీరో కొడుకు - Sakshi

క్షమాపణ చెప్పిన హీరో కొడుకు

మత్తు పదార్థాల కేసులో అరెస్టైన కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ క్షమాపణ ప్రజలకు చెప్పాడు.

బీజింగ్: మత్తు పదార్థాల కేసులో అరెస్టైన కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ క్షమాపణ ప్రజలకు చెప్పాడు. నిషేధిత డగ్స్ కేసులో పట్టుబడినందుకు తనను మన్నించాలని వేడుకున్నాడు. జాయ్ సీ చాన్ వ్యవహారాలు చూసే ఎమ్ స్టోన్స్  క్షమాపణ ప్రకటన విడుదల చేసింది. జాయ్ సీ చాన్ చేసిన పని సామాజికంగా చాలా ప్రభావం చూపుతుందని పేర్కొంది. అతడు త్వరలోనే మంచిదారిలోకి వస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న 31 ఏళ్ల జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచితుడైన ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి పోలీసులకు పట్టుబడ్డాడు. వీరు నిషేధిత మారిజూనా డ్రగ్ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చాన్ ఇంటి నుంచి వంద గ్రాములు మారిజూనా డ్రగ్ తీసుకొచ్చినట్టు వారు విచారణలో అంగీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement