రాహుల్ అకౌంట్ హ్యాకింగ్పై స్వామి కామెంట్స్ | Insider roles, says Subramanian Swamy on Rahul Gandhis Twitter account hacking | Sakshi
Sakshi News home page

రాహుల్ అకౌంట్ హ్యాకింగ్పై స్వామి కామెంట్స్

Dec 1 2016 5:35 PM | Updated on Aug 25 2018 6:49 PM

రాహుల్ అకౌంట్ హ్యాకింగ్పై స్వామి కామెంట్స్ - Sakshi

రాహుల్ అకౌంట్ హ్యాకింగ్పై స్వామి కామెంట్స్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్పై బీజేపీ ఫైర్బ్రాండ్ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి కామెంట్ చేశారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్పై బీజేపీ ఫైర్బ్రాండ్ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ తన ప్రవర్తనతో చాలామందిని బాధపెట్టాడని,  ఎవరో లోపల వ్యక్తులే ఇలాంటి చర్యకు పాల్పడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దుతో పాటు చాలా విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలను ఆయన వ్యతిరేకించేవాడని మండిపడ్డారు. కాగ బుధవారం సాయంత్రం రాహుల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్కు గురైన సంగతి తెలిసిందే. రాహుల్ ట్విట్టర్ను లక్ష్యంగా చేసకున్న  రాహుల్‌ గురించి, ఆయన కుటుంబం గురించి అభ్యంతరకరమైన దుర్భాషలు పోస్టుచేస్తూ నానా హంగామా చేశారు. కాంగ్రెస్ లోపలి వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండే అవకాశముంటుందని స్వామి రిపోర్టర్ల సమావేశంలో తెలిపారు. రాహుల్ తన ప్రవర్తనతో చాలా మందిని బాధపెట్టాడని పేర్కొన్నారు.  
 
దీనిపై ఢిల్లీ పోలీసు విచారణ చేపట్టారు. ఈ మేరకు అవసరమైన వివరాలను తెలుపాలని కోరుతూ ఈ సోషల్ మీడియా సైట్ మేనేజ్మెంట్కు లేఖ రాశారు. హ్యాకర్ల ఐపీ అడ్రస్తో పాటు మిగిలిన వివరాలను తమకు ఇవ్వాలని ట్విట్టర్ను కోరినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఈ విషయంపై ఆర్థిక నేరాల వింగ్లో ఫిర్యాదుచేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement