విమానం ఆచూకీ కోసం రంగంలోకి దిగిన భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్ | Indian navy and airforce searching for Malaysian flight | Sakshi
Sakshi News home page

విమానం ఆచూకీ కోసం రంగంలోకి దిగిన భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్

Mar 12 2014 4:18 PM | Updated on Sep 2 2017 4:38 AM

విమానం ఆచూకీ కోసం రంగంలోకి దిగిన భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్

విమానం ఆచూకీ కోసం రంగంలోకి దిగిన భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్

ఈ నెల 8వ తేదీ శనివారం అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఆచూకీ కోసం ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి.

న్యూఢిల్లీ: ఈ నెల 8వ తేదీ శనివారం అదృశ్యమైన  మలేషియా ఎయిర్లైన్స్ విమానం  ఆచూకీ కోసం  ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. ఈ  విమానం కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం  12 దేశాలు ఈ గాలింపు చర్యల్లో ఉన్నాయి. 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో కౌలాలంపూర్ నుంచి శుక్రవారం అర్థరాత్రి ఈ విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. మార్గ మధ్యంలో శనివారం  ఈ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది.

ఆ రోజు  నుంచి  చైనా, మలేషియాతోపాటు పలు దేశాల విమానాలు, ఓడలు రంగంలోకి దిగి ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా ఆ విమానానికి సంబంధించిన కనీస సమాచారం లభ్యం కాలేదు.  కాలాలంపూర్, బీజింగ్ మార్గంలో శాటిలైట్ ద్వారా చిత్రాలను తీయాలని ఆయా దేశాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ శాటిలైట్ చిత్రాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెడతున్నారు. సముద్రంలో ఎక్కడైనా విమానశకలాలు, ప్రయాణికుల వస్తువులు, సముద్రంపై నూనె తెట్టు లాంటి పదార్థాలు గుర్తించాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తు ఆ చిత్రాలను http://www.tomnod.com వెబ్సైట్లో ఉంచారు. ఈ  శాటిలైన్ చిత్రాలను నిన్న ఒక్క రోజునే దాదాపు 6 లక్షల మంది స్కాన్ చేసినట్లు కోలరాడో చెందిన డిజిటల్గ్లోబల్  కంపెనీ సీనియర్ డైరక్టర్ షెహర్ నాయ్ తెలిపారు.  అయినా ఏమాత్రం ఆచూకీ లభించలేదు.

ఈ పరిస్థితులలో విమానం ఆచూకీ తెలుసుకునేందుకు మలేషియా ప్రభుత్వం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది. వారికి సహాయపడేందుకు భారత ప్రభుత్వం కొంతమందిని నియమించిందని  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ విమానం ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయిదు రోజులుగా విమానం జాడ తెలియకపోవడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత్ నేవీ అండమాన్ సముద్రంలో  గాలింపు చర్యలు ప్రారంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement