breaking news
Malaysian flight
-
విమాన ప్రమాదం : ఎయిర్పోర్ట్ క్లోజ్
ఖట్మాండ్ : నేపాల్ రాజధాని ఖట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను శుక్రవారం మూసివేశారు. 139 ప్రయాణికులతో టేక్ఆఫ్ అవబోతోన్న ఓ మలేషియన్ జెట్ రన్‌వేపై జారీపోవడంతో, విమానశ్రయాన్ని మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. కానీ నేపాలి రాజధానికి రాబోతోన్న విమానాలన్నింటిన్నీ వేరే వైపుకు మరలిస్తున్నారు. రన్‌వేపై జారీపోయిన మలేషియన్‌కు చెందిన ఈ విమానం మలిండో ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 గా అధికారులు పేర్కొన్నారు. రన్‌వేకు 30 మీటర్ల దూరంలో గట్టిలోకి జారిపోయి, మట్టిలో ఈ విమానం కూరుకుపోయింది. విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి ప్రేమ్ నాథ్ థాకూర్ చెప్పారు. విమానం ఇలా ప్రమాదానికి గురికావడానికి కారణలేమిటన్నది? ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. మట్టిలో కూరుకుపోయిన ఆ విమానాన్ని బయటికి తీసినట్టు థాకూర్ తెలిపారు. గత నెల క్రితం కూడా అమెరికా-బంగ్లా ఎయిర్వేస్ ఖట్మాండ్ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రయాణికులు చనిపోయారు. 2015లో మార్చిలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ జెట్ కూడా ల్యాండ్ అయ్యేటప్పుడు జారీపోవడంతో, ట్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌ను 4 రోజులు మూసివేశారు. నేపాల్‌లో ఎయిర్ సేఫ్టీలో అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్‌లో పలు విమాన ప్రమాదాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కారణంతో యూరోపియన్ యూనియన్ ఎయిర్‌స్పేస్‌లో నేపాల్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ఎగరడానికి వీలులేకుండా నిషేధం విధించారు. -
భారత రక్షణ వ్యవస్థలో డొల్లతనం
-
ఇంకా వీడని మలేషియా విమానం మిస్టరీ
-
విమానం ఆచూకీ కోసం రంగంలోకి దిగిన భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్
న్యూఢిల్లీ: ఈ నెల 8వ తేదీ శనివారం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఆచూకీ కోసం ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. ఈ విమానం కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 12 దేశాలు ఈ గాలింపు చర్యల్లో ఉన్నాయి. 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో కౌలాలంపూర్ నుంచి శుక్రవారం అర్థరాత్రి ఈ విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. మార్గ మధ్యంలో శనివారం ఈ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆ రోజు నుంచి చైనా, మలేషియాతోపాటు పలు దేశాల విమానాలు, ఓడలు రంగంలోకి దిగి ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా ఆ విమానానికి సంబంధించిన కనీస సమాచారం లభ్యం కాలేదు. కాలాలంపూర్, బీజింగ్ మార్గంలో శాటిలైట్ ద్వారా చిత్రాలను తీయాలని ఆయా దేశాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ శాటిలైట్ చిత్రాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెడతున్నారు. సముద్రంలో ఎక్కడైనా విమానశకలాలు, ప్రయాణికుల వస్తువులు, సముద్రంపై నూనె తెట్టు లాంటి పదార్థాలు గుర్తించాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తు ఆ చిత్రాలను http://www.tomnod.com వెబ్సైట్లో ఉంచారు. ఈ శాటిలైన్ చిత్రాలను నిన్న ఒక్క రోజునే దాదాపు 6 లక్షల మంది స్కాన్ చేసినట్లు కోలరాడో చెందిన డిజిటల్గ్లోబల్ కంపెనీ సీనియర్ డైరక్టర్ షెహర్ నాయ్ తెలిపారు. అయినా ఏమాత్రం ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితులలో విమానం ఆచూకీ తెలుసుకునేందుకు మలేషియా ప్రభుత్వం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది. వారికి సహాయపడేందుకు భారత ప్రభుత్వం కొంతమందిని నియమించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ విమానం ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయిదు రోజులుగా విమానం జాడ తెలియకపోవడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత్ నేవీ అండమాన్ సముద్రంలో గాలింపు చర్యలు ప్రారంభించింది.