భారతీయ బాలికను చంపిన పాకిస్థానీ కుర్రాడు | Indian girl killed by Pakistani boy in UAE | Sakshi
Sakshi News home page

భారతీయ బాలికను చంపిన పాకిస్థానీ కుర్రాడు

Oct 7 2015 4:55 PM | Updated on Mar 23 2019 8:36 PM

భారతీయ బాలికను చంపిన పాకిస్థానీ కుర్రాడు - Sakshi

భారతీయ బాలికను చంపిన పాకిస్థానీ కుర్రాడు

తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో 14 ఏళ్ల భారతీయ బాలికను చంపేశాడో పాకిస్థానీ కుర్రాడు. అతడి వయసు కూడా 14 ఏళ్లే.

తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో 14 ఏళ్ల భారతీయ బాలికను చంపేశాడో పాకిస్థానీ కుర్రాడు. అతడి వయసు కూడా 14 ఏళ్లే. ఈ దారుణం దుబాయ్లో జరిగింది. ఆమెను చంపిన తర్వాత ఆత్మాహుతి చేసుకున్నాడు. బాలిక తల్లి ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన సమయంలో ఆ కుర్రాడు బాలిక ఉండే ఫ్లాట్కు వెళ్లాడు. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో మాత్రం స్పష్టంగా తెలియలేదు.

ఆమెను కత్తితో పొడిచి పొడిచి చంపేసిన తర్వాత.. ఇద్దరి మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆ ఫ్లాట్ లోని బెడ్రూం మొత్తం కూడా తగలబడిపోయింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత ఇద్దరి మృతదేహాలను వాళ్ల బంధువులకు అందిస్తామని పోలీసులు చెప్పారు. గదిలో ద్రవ ఇంధనం ఉందని అంటున్నారు. ఆ బాలిక మంచి డాన్సర్ కావాలని అనుకునేదని, ప్రముఖ భారతీయ నృత్యబృందంలో ఆమె సభ్యురాలని తెలుస్తోంది. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement