కర్నాటకలో బెలికెరి పోర్టు నుంచి అక్రమంగా ఇనుప ఖనిజం తరలించారనే కేసులో బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సురేష్ బాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 27 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది.
అక్రమ మైనింగ్ కేసులో ఎమ్మెల్యే సురేశ్ బాబుకు రిమాండ్!
Sep 20 2013 3:44 PM | Updated on Sep 1 2017 10:53 PM
కర్నాటకలో బెలికెరి పోర్టు నుంచి అక్రమంగా ఇనుప ఖనిజం తరలించారనే కేసులో బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సురేష్ బాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 27 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న గాలి జనార్ధన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సురేశ్ బాబును సీబీఐ గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు.
కర్నాటక లోకయుక్తా ఎన్ సంతోష్ హెగ్డే అక్రమ కుంభకోణంపై ఆరోపణలు చేశారు. ఈ కేసులో 2006-2007, 2010-11 సంవత్సర మధ్యకాలంలో 7.74 మిలియన్ల ఖనిజ సంపదను అక్రమంగా తరలించారని ఆరోపణల్ని నివేదికలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement