నిబంధనలు ఒప్పుకుంటే ఓకే: అమరీందర్‌ | If Sidhu Does Kapil Sharma Show, His Portfolio May Be Changed: CM | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఒప్పుకుంటే ఓకే: అమరీందర్‌

Mar 23 2017 3:21 AM | Updated on Sep 5 2017 6:48 AM

నిబంధనలు ఒప్పుకుంటే ఓకే: అమరీందర్‌

నిబంధనలు ఒప్పుకుంటే ఓకే: అమరీందర్‌

కమెడియన్‌ కపిల్‌ శర్మ వ్యాఖ్యాతగా ఉండే టీవీ సిరీస్‌లో పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌ సిద్ధూ కొనసాగడాన్ని.. రాజ్యాంగ నిబంధనలు అనుమతిస్తే తనకేం ఇబ్బందీ లేదని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్‌ సింగ్‌

న్యూఢిల్లీ: కమెడియన్‌ కపిల్‌ శర్మ వ్యాఖ్యాతగా ఉండే టీవీ సిరీస్‌లో పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌ సిద్ధూ కొనసాగడాన్ని.. రాజ్యాంగ నిబంధనలు అనుమతిస్తే తనకేం ఇబ్బందీ లేదని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్‌ సింగ్‌ స్పష్టంచేశారు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు ఇందుకు విరుద్ధంగా ఉంటే రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుంచి సిద్ధూను మార్చుతానని అమరీందర్‌ చెప్పారు. ‘ఈ విషయమై రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ అతుల్‌ నందాను అభిప్రాయం కోరాం. ఆయనింకా ఈ విషయాన్ని పరిశీలించలేదు’ అని అన్నారు. మంత్రి హోదాలో ఓ టీవీ షోలో సిద్ధూ కొనసాగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, తన కుటుంబ ఖర్చుల కోసం, తన అభిరుచి మేరకే టీవీ సిరీస్‌లో కొనసాగుతానని సిద్ధూ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement