breaking news
Chief Minister Amarinder Singh
-
ఆర్ఎస్ఎస్ రిక్వెస్ట్‌కి కాంగ్రెస్ సీఎం ఓకే
సాక్షి, ఛండీగఢ్ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నేత రవిందర్ గోసెయిన్ హత్య కేసు విషయంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గత రాత్రి(గురువారం) తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి మేరకు గోసాని హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించాం. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు పంజాబ్ పోలీసుల సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. On request of @RSSorg, I’ve ordered transfer of Gosain murder case to NIA for better coordination between central agencies & Punjab police. — Capt.Amarinder Singh (@capt_amarinder) October 19, 2017 ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన 60 ఏళ్ల రవిందర్ గోసెయిన్‌ను లూథియానా కైలాశ్ నగర్ సమీపంలో మోటర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న ఈ ఘటన చోటుచేసుకోగా.. వెంనటే ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. అయితే ఆయన హత్య వెనక కుట్ర దాగుందని వాదిస్తూ ఎన్ఐఏ విచారణ కోసం ఆర్ఎస్ఎస్ పట్టుబట్టింది. దీంతో అందుకు పంజాబ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఙక మృతుడు గోసెయిన్ కుటుంబానికి ఐదు లక్షల పరిహారంతోపాటు, ఆయన నలుగురి పిల్లలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ ఇదివరకే ప్రకటించారు. -
నిబంధనలు ఒప్పుకుంటే ఓకే: అమరీందర్
న్యూఢిల్లీ: కమెడియన్ కపిల్ శర్మ వ్యాఖ్యాతగా ఉండే టీవీ సిరీస్‌లో పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సిద్ధూ కొనసాగడాన్ని.. రాజ్యాంగ నిబంధనలు అనుమతిస్తే తనకేం ఇబ్బందీ లేదని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు ఇందుకు విరుద్ధంగా ఉంటే రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుంచి సిద్ధూను మార్చుతానని అమరీందర్ చెప్పారు. ‘ఈ విషయమై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అతుల్ నందాను అభిప్రాయం కోరాం. ఆయనింకా ఈ విషయాన్ని పరిశీలించలేదు’ అని అన్నారు. మంత్రి హోదాలో ఓ టీవీ షోలో సిద్ధూ కొనసాగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, తన కుటుంబ ఖర్చుల కోసం, తన అభిరుచి మేరకే టీవీ సిరీస్‌లో కొనసాగుతానని సిద్ధూ ప్రకటించారు.