ఆర్‌ఎస్‌ఎస్‌ విజ్ఞప్తికి అంగీకరించిన పంజాబ్‌ సీఎం

RSS Leader Murder Case NIA Probe - Sakshi

సాక్షి, ఛండీగఢ్‌ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) నేత రవిందర్‌ గోసెయిన్‌ హత్య కేసు విషయంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన గత రాత్రి(గురువారం) తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విజ్ఞప్తి మేరకు గోసాని హత్య కేసును ఎన్‌ఐఏకు అప్పగించాం. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు పంజాబ్‌ పోలీసుల సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అయిన 60 ఏళ్ల రవిందర్‌ గోసెయిన్‌ను లూథియానా కైలాశ్ నగర్‌ సమీపంలో మోటర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 17న ఈ ఘటన చోటుచేసుకోగా.. వెంనటే ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించింది. అయితే ఆయన హత్య వెనక కుట్ర దాగుందని వాదిస్తూ ఎన్‌ఐఏ విచారణ కోసం ఆర్ఎస్‌ఎస్‌ పట్టుబట్టింది. దీంతో అందుకు పంజాబ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఙక మృతుడు గోసెయిన్‌ కుటుంబానికి ఐదు లక్షల పరిహారంతోపాటు, ఆయన నలుగురి పిల్లలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్‌ ఇదివరకే ప్రకటించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top