టీమంతా ప్రాక్టీస్‌లో.. ధోనీ మాత్రం.. | ICC Champions Trophy 2017: MS Dhoni spends quality time with family before semifinal clash against Bangladesh | Sakshi
Sakshi News home page

టీమంతా ప్రాక్టీస్‌లో.. ధోనీ మాత్రం..

Jun 14 2017 11:23 AM | Updated on Sep 5 2017 1:37 PM

టీమంతా ప్రాక్టీస్‌లో.. ధోనీ మాత్రం..

టీమంతా ప్రాక్టీస్‌లో.. ధోనీ మాత్రం..

ధోనీ షికారుకెళ్లినప్పటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

బర్మింగ్‌హామ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఐసీసీ చాంపియన్స​ ట్రోఫీలో తలపడుతున్న టీమిండియా గురువారం జరగనున్న సెమీ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. కీలకమైన మ్యాచ్‌ కావడంతో జట్టు సభ్యులంతా ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. మాజీ కెప్టెన్‌ ధోనీ మాత్రం జట్టుకు దూరంగా.. ఫ్యామిలితో కలిసి ఎంజాయ్‌ చేశారు.

భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి ధోనీ షికారుకెళ్లినప్పటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా ఫొటోలను షేర్‌ చేశారు. ధోనీతోపాటే లండన్‌ వెళ్లిన సాక్షి.. సౌతాఫ్రికాతో ఇండియా మ్యాచ్‌కు ముందు ‘ఫ్యామిలీ టైమ్‌’ అంటూ పోస్ట్‌ చేసిన ఫొటోకూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

చాంపియన్స్‌ట్రోఫీ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్కటి మినహా అంతగా రాణించని ధోనీ.. సెమీస్‌లోనైనా సత్తాచూపుతాడా లేదా వేచిచూడాలి. బర్మింగ్‌హాహ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం(భారత కాలమానం ప్రకారం) భారత్‌- బంగ్లాల మధ్య సెమీస్‌ మ్యాచ​ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement