సీఎంకు కాదు మాజీ సీఎంకే విధేయుణ్ని | I Am Loyal Only to Lalu, Nitish is Not My Leader: Shahabuddin After Bail | Sakshi
Sakshi News home page

సీఎంకు కాదు మాజీ సీఎంకే విధేయుణ్ని

Sep 10 2016 2:53 PM | Updated on Sep 4 2017 12:58 PM

సీఎంకు కాదు మాజీ సీఎంకే విధేయుణ్ని

సీఎంకు కాదు మాజీ సీఎంకే విధేయుణ్ని

నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి అయినా తన నాయకుడు మాత్రం లాలు ప్రసాదేనని షహబుద్దీన్ అన్నాడు.

పట్నా: నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి అయినా తన నాయకుడు మాత్రం లాలు ప్రసాదేనని, ఆయనకు మాత్రమే తాను  విధేయుడినని ఆర్జేడీ మాజీ ఎంపీ, డాన్ మొహమ్మద్ షహబుద్దీన్ అన్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న షహబుద్దీన్ 11 ఏళ్ల తర్వాత  బెయిల్పై విడుదలయ్యాడు. తాను జైలుకు వెళ్లాక ఆర్జేడీలో పలు మార్పులు జరిగాయని చెప్పాడు.

లాలు కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గురించి షహబుద్దీన్ మాట్లాడుతూ.. ప్రజలు ఆయన్ను నాయకుడిగా ఆమోదించినా, తనకు మాత్రం పిల్లాడేనని, తేజస్వి తండ్రే తనకు నాయకుడని స్పష్టం చేశాడు. 2005లో నితీష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షహబుద్దీన్ జైలుకు వెళ్లాడు. ఆర్జేడీ మద్దతుతో నితీష్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆయన విడుదలకావడంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. జంగల్ రాజ్ మళ్లీ వచ్చిందనడానికి షహబుద్దీన్ విడుదలే నిదర్శనమని నితీష్పై విమర్శలు చేశారు. కాగా కోర్టు తనను జైలుకు పంపిందని, ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని షహబుద్దీన్ విమర్శలను కొట్టిపారేశాడు. తాను జైలులో ఉన్నప్పుడు హత్యలు జరిగాయని, అన్నిటికీ తననే ఎందుకు నిందిస్తారని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement