డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరు అరెస్టు.. | hyderabad police arrest the two persons in drug case in chennai | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరు అరెస్టు..

Aug 18 2017 6:40 PM | Updated on Sep 4 2018 5:29 PM

డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరు అరెస్టు.. - Sakshi

డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరు అరెస్టు..

మాదకద్రవ్యాలు సరఫరా చేసిన కేసులో వేలూరుకు చెందిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

వేలూరు: తెలుగు సినీ నటులకు మాదకద్రవ్యాలు సరఫరా చేసిన కేసులో వేలూరుకు చెందిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల  ఈ కేసు నగరంలో రోజుకో మలుపు తిరిగి హల్‌ చల్‌ చేసింది. తెలుగు నటులకు డ్రగ్స్‌ సరఫరా చేసిన కేసులో ఇప్పటికే అరెస్టులు, విచారణలు జరిగిన విషయం తెలిసిందే. విచారణలో వెల్లడైన వివరాల మేరకు హైదరాబాద్‌ పోలీసులు సత్వచ్చారి ప్రాంతానికి  చేరుకుని రత్నగిరికి చెందిన ఇద్దరిని గురువారం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకోచ్చారు.  

ఈ మాదక ద్రవ్యాల కేసులో కాట్పాడికి చెందిన ఒకరిని రెండు నెలల క్రితమే పోలీసుల అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలిసింది. అతను తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వివరాలు వెల్లడించలేదన్నారు. అతడు తెలిపిన సమాచారం మేరకు మరో ఇద్దరిని పట్టుకున్నారని సమాచారం. అయితే ఆ ఇద్దరి వ్యక్తులకు డ్రగ్స్‌ కేసులో సంబంధాలున్నాయా లేదా తెలియాల్సి ఉంది.

డ్రగ్స్‌ కేసులో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు గత నెల 19 నుంచి 27 వరకు సిట్‌ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. జూలైలో 12 మంది సినీ ప్రముఖులు, 17 మంది ఇతర రంగాలకు చెందిన వారిని ఏకంగా 13 నుంచి 14 గంటల పాటు సిట్‌ విచారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement