మాజీ భర్త సినిమాపై ఆమె స్పందన! | hero ex wife comments on Kaabil | Sakshi
Sakshi News home page

మాజీ భర్త సినిమాపై ఆమె స్పందన!

Dec 22 2016 3:47 PM | Updated on Sep 4 2017 11:22 PM

మాజీ భర్త సినిమాపై ఆమె స్పందన!

మాజీ భర్త సినిమాపై ఆమె స్పందన!

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో విడాకులు తీసుకున్నా.. అతనికి అండగా నిలిచే విషయంలో మాజీ భార్య సుసానె ఖాన్‌ ఎప్పుడూ ముందుంటున్నారు

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో విడాకులు తీసుకున్నా.. అతనికి అండగా నిలిచే విషయంలో మాజీ భార్య సుసానె ఖాన్‌ ఎప్పుడూ ముందుంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పబ్లిక్‌గా మాజీ భర్తకు అండగా నిలిచిన సుసానె.. తాజాగా 'కాబిల్‌' సినిమా విషయంలోనూ మద్దతు పలికారు.

ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన సుసానెకు ఇటీవల చార్‌కోల్‌ డిజైన్‌ ప్రాజెక్టుకు అవార్డు లభించింది. బుధవారం ముంబైలో ఈ అవార్డు అందుకున్న సందర్భంగా 'కాబిల్‌' సినిమా గురించి ఆహూతులు ఆమె స్పందన అడిగారు. 'మొహెంజోదారు' ప్లాప్‌ తర్వాత సొంత బ్యానర్‌లో హృతిక్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా గురించి అడగ్గానే నవ్వుతూ స్పందించిన ఆమె.. 'ఆల్‌ ద బెస్ట్‌. ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని నాకు నమ్మకం ఉంది' అని ఆమె పేర్కొన్నారు.

17 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్తూ 2013లో హృతిక్‌, సుసానె విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు రెహాన్‌, రిధాన్‌ ఉన్నారు. విడాకుల అనంతరం కూడా ఈ జంట అప్పుడప్పుడు కలుస్తూ స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఇటీవల ఈ జంట పిల్లలతో కలిసి ఓ డిన్నర్‌ పార్టీలో సరదాగా గడిపింది. గతంలో కంగనా-హృతిక్‌ మధ్య నడిచిన లీగల్‌ పోరులోనూ మాజీ భర్తకు సుసానె అండగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement