కేంద్ర ప్రభుత్వం రూ.992.61 కోట్ల విలువైన 17 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) ప్రతి పాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెలన్ ల్యాబొరేటరీస్
17 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
Published Wed, Sep 4 2013 2:54 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
17 FDI proposals,foreign direct investment,Jet-Etihad deal, FIPB
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.992.61 కోట్ల విలువైన 17 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) ప్రతి పాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెలన్ ల్యాబొరేటరీస్ రూ.12.55 కోట్ల ప్రతి పాదన ఉంది. రూ. 2,058 కోట్ల విలువైన జెట్-ఎతిహాద్ డీల్ తుది క్లియరెన్స్ కోసం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్‌కు నివేదించింది. ఐదు ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
5 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను తిరస్కరించింది. సింగపూర్‌కు చెందిన ఫ్రెసెనియస్ కాబి తన భారత అనుబంధ కంపెనీని స్టాక్ మార్కెట్ల నుంచి డీలిస్ట్ చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ఎఫ్‌డిఐ విలువ రూ.349.03 కోట్లు. ఫార్మా ప్రతిపాదనల్లో కాలిక్స్ కెమికల్స్(రూ.200 కోట్లు), స్మిత్ అండ్ నెఫ్యూ, సింగపూర్(రూ.142.29 కోట్లు) ఎఫ్‌డీఐ లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో వైట్ లేబుల్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామన్న ముత్తూట్ ఫైనాన్స్ ప్రతిపాదన ఓకే అయింది.
Advertisement
Advertisement