దేశంలో మోస్ట్‌ అట్రాక్టివ్‌ సంస్థ ఏదో తెలుసా? | Sakshi
Sakshi News home page

దేశంలో మోస్ట్‌ అట్రాక్టివ్‌ సంస్థ ఏదో తెలుసా?

Published Thu, Apr 27 2017 2:47 PM

దేశంలో మోస్ట్‌ అట్రాక్టివ్‌ సంస్థ ఏదో తెలుసా?

న్యూఢిల్లీ:  సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా దేశంలో అత్యంత ఆకర్షణీయమైన  బ్రాండ్‌గా నిలిచింది.  హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ రాండ్‌స్టడ్‌ సర్వే ప్రకారం  గూగుల్‌ ఇండియా  ఎట్రాక్టివ్‌ ఎంప్లాయిర్‌గా  ఫస్ట్‌ ప్లేస్‌ కొట్టేసింది. అలాగే మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా  రెండవ స్తానంలో నిలిచింది.   

మానవ వనరుల సేవల సంస్థ రాండ్‌స్టడ్  2017 నివేదిక సర్వే  ప్రకారం గూగుల్‌ ఈ ఘనతను సాధించింది. ఈ  సర్వే లో ఈ కామర్స్‌ లో అమెజాన్‌ ఇండియా,  ఎఫ్‌ఎంసీజీ ఐటీసీ, కన్యూమర్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌  ఫిలిప్స్‌ ఇండియాలాంటి దిగ్గజాలు ఈ పోటీల్లో  రంగాలవారీగా టాప్‌లో నిలిచాయి. మరోవైపు స్టార్ట్‌ అప్‌ కంపెనీల్లో పనిచేయడానికి ఐటీ నిపుణులు మొగ్గు   చూపుతున్నారట.

నిపుణులు,  ప్రతిభావంతులలైన  ఉద్యోగులకోసం  కంపెనీలు వ్యూహాత్మక  ప్రాముఖ్యతను కొనసాగిస్తున్నాయని రాండ్ స్టడ్ ఇండియా ఎండీ  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మూర్తీ కే ఉప్పాపురి చెప్పారు. క్రొత్త బ్రాండ్లను ఆకర్షించడం,  నిలబెట్టుకోవడంతోపాటు  పెట్టుబడిదారుల బ్రాండింగ్ వాల్యూను పెంచుకోవడంపై సంస్థలు దృష్టిపెట్టాయని  తెలిపారు.

సర్వే ఫలితాలు ప్రకారం, పెద్ద, బహుళజాతి సంస్థలు ఉద్యోగులు ఇష్టపడే ఎక్కువ  కార్యాలయంగా ఉన్నాయి. ముఖ‍్యంగా ఐఐటీ, ఐటి, రిటైల్, ఎఫ్ఎంసిజి రంగాల  కంపెనీల కోసం భారతీయలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారుని సర్వేలో తేలింది.   దేశంలో ఉత్తమ 'యజమాని బ్రాండ్'ను గుర్తించేందుకు రాండ్ స్టడ్ అవార్డు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement