కళ్లజోళ్లకు గుడ్‌బై! | Goodbye to Goggles! | Sakshi
Sakshi News home page

కళ్లజోళ్లకు గుడ్‌బై!

Nov 16 2015 12:41 AM | Updated on Sep 3 2017 12:32 PM

కళ్లజోళ్లకు గుడ్‌బై!

కళ్లజోళ్లకు గుడ్‌బై!

ఇంకో రెండేళ్లు. ఐ సైట్ కోసం గాగుల్స్ వాడటం. ఆ తరువాత? నొప్పిలేని చిన్న ఆపరేషన్... కంట్లోనే ఓ లెన్స్...

ఇంకో రెండేళ్లు. ఐ సైట్ కోసం గాగుల్స్ వాడటం. ఆ తరువాత? నొప్పిలేని చిన్న ఆపరేషన్... కంట్లోనే ఓ లెన్స్... జీవితాంతం 20/20 కంటే మూడు రెట్లు ఎక్కువ స్పష్టమైన చూపు. అంతా ఆక్యూమెటిక్స్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన బయోనిక్ లెన్స్ మహిమ! అవును. మీరు చదివింది నిజమే. 2017 నాటికల్లా దృష్టిలోపాల కోసం కళ్లజోళ్లు ధరించడం గతకాలపు మాట అవుతుంది అంటున్నారు బయోనిక్ లెన్స్  సృష్టికర్త డాక్టర్ గార్త్ వెబ్. ఎనిమిదేళ్ల పరిశోధనల ఫలితంగా తయారు చేసిన ఈ లెన్స్‌ను కేవలం ఎనిమిది నిమిషాల్లో కంట్లో అమర్చవచ్చు. ఇది కూడా చాలా సింపుల్‌గా జరిగిపోతుంది. ముడుచుకుపోయి సూక్ష్మస్థాయిలో ఉండే బయోనిక్ లెన్స్‌ను ఉప్పునీటి ద్రావణం ద్వారా కంట్లోకి స్ప్రేచేస్తారు. పది సెకన్లలో బయోనిక్ లెన్స్ విచ్చుకుంటుంది.

దానంతటఅదే కనుగుడ్డు ఎక్కడ ఉందో గుర్తించి దానిపై ఒక పొరలా పరుచుకుంటుంది. అంతే. మీ చత్వారం, దూరదృష్టి, హ్రస్వదృష్టి లోపాలన్నీ గాయబ్! అంతేకాదు... ఒకసారి ఈ బయోనిక్ లెన్స్‌ను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో మీకు కంటిశుక్లాలు వచ్చే అవకాశం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. అంటే... ముసలితనంలోనూ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరముండదన్నమాట. ప్రస్తుతం దృష్టి లోపాల సవరణకు ఉపయోగిస్తున్న లాసిక్ సర్జరీ కంటే ఇది ఎంతో మెరుగైందని, నిరపయాకరమైంది కూడానని గార్త్ వెబ్ అంటున్నారు. మరిన్ని ట్రయల్స్ తరువాత 2017 నాటికల్లా ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement