ఫ్యూచర్ గ్రూప్తో రాందేవ్ బాబా ఒప్పందం | Future Group ties up with Patanjali | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్ గ్రూప్తో రాందేవ్ బాబా ఒప్పందం

Oct 9 2015 2:41 PM | Updated on Sep 3 2017 10:41 AM

ఫ్యూచర్ గ్రూప్తో రాందేవ్ బాబా ఒప్పందం

ఫ్యూచర్ గ్రూప్తో రాందేవ్ బాబా ఒప్పందం

యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేదిక్స్.. ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ ఫ్యూచర్ గ్రూప్ తో కీలక వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది.

న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేదిక్స్.. ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ ఫ్యూచర్ గ్రూప్ తో కీలక వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. పతంజలి సంస్థ తయారుచేసే ఉత్పత్తులను..  240 నగరాల్లోని రిటైల్ అవుట్ లెట్లలో విక్రయించనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే 20 నెలల కాల వ్యవధిలో వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరుపనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం మీడియాకు తెలిపారు.

 

ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లాంటి స్వదేశీ రిటైల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ సంస్థకు రెట్టింపు గౌరవం దక్కుతుందని, తద్వారా ప్రపంచ శ్రేణి ఉత్పత్తుతులను తక్కువ ధరకే అందించే వీలుంటుందన్నారు. 20015- 16 ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోపు పతంజలి ఫుడ్స్ టర్నోవర్ రూ. 5 వేల కోట్లకు చేరుకుంటుందని రాందేవ్ చెప్పారు. మ్యాగీ నిషేధం తరువాత తమ సంస్థ రూపొందించిన దేశీ ఆటా నూడుల్స్ విక్రయాలను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు, ఒక్కో ప్యాకెట్ ధర రూ. 25గా నిర్ధారించినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement