మహా విస్ఫోటం నుంచి నేటి దాకా.. | from bigbang to till today | Sakshi
Sakshi News home page

మహా విస్ఫోటం నుంచి నేటి దాకా..

May 9 2014 12:41 AM | Updated on Sep 2 2017 7:05 AM

మహా విస్ఫోటం నుంచి నేటి దాకా..

మహా విస్ఫోటం నుంచి నేటి దాకా..

సుమారు 1,370 కోట్ల ఏళ్ల క్రితం మహా విస్ఫోటం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించి... అది నేటి దాకా పరిణామం చెందిన క్రమాన్ని వివరిస్తూ రూపొందించిన కంప్యూటర్ సిమ్యులేషన్ చిత్రమిది

సుమారు 1,370 కోట్ల ఏళ్ల క్రితం మహా విస్ఫోటం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించి... అది నేటి దాకా పరిణామం చెందిన క్రమాన్ని వివరిస్తూ రూపొందించిన కంప్యూటర్ సిమ్యులేషన్ చిత్రమిది. విశ్వ పరిణామాన్ని వివరించే చిత్రాలతో ‘ఇలస్ట్రిస్’ అనే కంప్యూటర్ సిమ్యులేషన్(అనుకరణ వీడియో)ను మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది.  8 వేల సీపీయూలను వినియోగించి, 1,200 కోట్ల 3డీ పిక్సెల్స్‌తో ఈ ఇలస్ట్రిస్‌ను ఆవిష్కరించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం నుంచి నేటి దాకా విశ్వం ఏ కాలానికి ఎలా విస్తరించింది? కంటికి కనిపించని కృష్ణపదార్థం, కనిపించే సాధారణ  పదార్థం ఎలా వ్యాపించాయి? గెలాక్సీలు, నక్షత్రాల ఆవిర్భావం తదితర వివరాలను ఈ ఇలస్ట్రిస్ తెలియజేస్తుంది.
 
 సింపుల్‌గా చెప్పాలంటే ఇది విశ్వంలో ఏ కాలాన్ని అయినా చూపే టైం మెషిన్ లాంటిదన్నమాట. దీని ద్వారా నేటి నుంచి వెనక్కి.. లేదా బిగ్‌బ్యాంగ్ నుంచి నేటికి ఎలాగైనా విశ్వాంతరాలను అన్వేషించవచ్చె. చిత్రం లో నీలి రంగులో ఉన్నది కృష్ణపదార్థం, మిగతాది గెలాక్సీలు, గెలాక్సీ క్లస్టర్స్‌తో కూడిన సాధారణ పదార్థం.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement