కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు.
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. పుచ్చకాయలమాడకు చెందిన రంగన్న సాగు కోసం రూ.4 లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు.
వర్షాభావ పరిస్థితులతో గత కొన్ని రోజులుగా అప్పులు ఎలా తీర్చాలన్న విషయమై తీవ్ర వేదన చెందుతున్న అతడికి బుధవారం ఉదయం గుండెపోటు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్టు చెప్పారు.