మాజీ మంత్రి మాణిక్‌రావు కన్నుమూత | ex minister manik rao dies in hyderabad | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి మాణిక్‌రావు కన్నుమూత

Sep 8 2016 9:39 AM | Updated on Jul 11 2019 8:34 PM

మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

తాండూరు(రంగారెడ్డి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్‌రావును కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు.

మాణిక్‌రావు రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 14 సంవత్సరాల పాటు వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement