నోట్ల రద్దును టాటా ఎలా అభివర్ణించారో తెలుసా? | Demonetisation Among Three Most Important Economic Reforms: Ratan Tata | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దును టాటా ఎలా అభివర్ణించారో తెలుసా?

Nov 26 2016 4:47 PM | Updated on Sep 4 2017 9:12 PM

నోట్ల రద్దును టాటా ఎలా అభివర్ణించారో తెలుసా?

నోట్ల రద్దును టాటా ఎలా అభివర్ణించారో తెలుసా?

దేశ కార్పొరేట్ చరిత్రలో కనివినీ రీతిలో చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన వివాదంలో తలమునకలై ఉన్న రతన్ టాటా, ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు.

న్యూఢిల్లీ : దేశ కార్పొరేట్ చరిత్రలో కనివినీ రీతిలో చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన వివాదంలో తలమునకలై ఉన్న రతన్ టాటా, ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. మూడు అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటని రతన్ టాటా అభివర్ణించారు. బ్లాక్మనీని నిర్మూలించడానికి ఇది ఎంతో సహకరిస్తుందంటూ డీమానిటైజేషన్ను కొనియాడారు. అయితే అమలు సరిగా లేదని వ్యాఖ్యానించారు. లోపాలను యుద్ధప్రాతిపదికన సరిదిద్దాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న బోల్డ్ డిమానిటైజేషన్ నిర్ణయానికి దేశమంతా మద్దతివ్వాలని టాటా పిలుపునిచ్చారు. భారతీయ చరిత్రలో డిలైసెన్సింగ్, జీఎస్టీతో పాటు బ్లాక్ మనీపై పోరాటం చేస్తూ పెద్దనోట్ల రద్దు చేయడం కూడా మూడు అత్యంత ముఖ్యమైన ఆర్థికసంస్కరణల్లో ఒకటని కొనియాడారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement