సీఎం వద్దన్నా.. బాధ్యతలు స్వీకరించిన సీఎస్! | delhi cs takes charge despite kejriwal's opposition | Sakshi
Sakshi News home page

సీఎం వద్దన్నా.. బాధ్యతలు స్వీకరించిన సీఎస్!

May 16 2015 3:05 PM | Updated on Sep 3 2017 2:10 AM

సీఎం వద్దన్నా.. బాధ్యతలు స్వీకరించిన సీఎస్!

సీఎం వద్దన్నా.. బాధ్యతలు స్వీకరించిన సీఎస్!

దేశ రాజధానిలో మళ్లీ రాజకీయ వేడి రగులుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దాదాపు జుట్టు జట్టు పట్టుకున్నంత పరిస్థితి ఏర్పడింది.

దేశ రాజధానిలో మళ్లీ రాజకీయ వేడి రగులుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దాదాపు జుట్టు జట్టు పట్టుకున్నంత పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా చేస్తున్నారంటూ ప్రభుత్వం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శకుంతలా గామ్లిన్ను ఆయన రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ముఖ్యమంత్రి వద్దని చెబుతున్నా.. ఆమె బాధ్యతలు కూడా స్వీకరించేశారు. అయితే ఇలా లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా సీఎస్ను నియమించడం తగదని కేజ్రీవాల్ సర్కారు వర్గాలు అంటున్నాయి.

ఆమె విద్యుత్ శాఖలో పనిచేస్తున్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కూడా ఆరోపణలున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఆరోపించారు. ప్రభుత్వాన్ని కాదని చీఫ్ సెక్రటరీని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఎవరి వాదనలో వాళ్లు ఉండగానే శకుంతలా గామ్లిన్ మాత్రం.. తన కొత్త పదవిలో పని ప్రారంభించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement