ప్రముఖ నృత్యకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాభాయి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు.
అహ్మదాబాద్: ప్రముఖ నృత్యకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాభాయి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. బుధవారం ఆమె తన 20 మంది అనుచరులతో కలసి వాస్నాలోని ఆప్ కార్యాలయానికి వెళ్లి ఏఏపీలో చేరారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా అనేక ఏళ్లుగా తాను పోరాడుతూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మల్లికా సారాభాయి 2009లో గాంధీనగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ అగ్రనేతఅద్వానీపై పోటీపడి ఓటమి పాలయ్యారు.