డేనిష్ మహిళపై అత్యాచారం: మూడో వ్యక్తి అరెస్టు | Danish woman gangrape: 3rd man held in 3-day police custody | Sakshi
Sakshi News home page

డేనిష్ మహిళపై అత్యాచారం: మూడో వ్యక్తి అరెస్టు

Jan 17 2014 6:46 PM | Updated on Sep 2 2017 2:43 AM

దేశ రాజధాని నగరంలో 51 ఏళ్ల డేనిష్ మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మూడో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

దేశ రాజధాని నగరంలో 51 ఏళ్ల డేనిష్ మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మూడో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. రాజు సింగ్ (23) అనే వ్యక్తిని గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసి, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధాంశు కౌశిక్ ఎదుట హాజరు పరచగా, ఆయన మూడు రోజుల కస్టడీకి పంపారు.

మహేందర్ అలియాస్ గంజా, మహ్మద్ రజా అనే ఇద్దరు నిందితులతో రాజు సింగ్ గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు. మొత్తం ఎనిమిది మంది నిందితులలో రాజు ఒకడు. వీళ్లంతా కూడా సంచారజీవులే. జనవరి 14వ తేదీ రాత్రి ఢిల్లీలో ఓ డేనిష్ మహిళ (51)ని వీళ్లు కత్తులు చూపించి బెదిరించి, దోచుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. బాధితురాలి నుంచి వారు దొంగిలించిన ఐ ప్యాడ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement