లక్కీ ఇన్వెస్టర్లు.. అదరగొట్టిన డీ-మార్ట్ | D-Mart listing: Avenue Supermarts shares rise over 104% | Sakshi
Sakshi News home page

లక్కీ ఇన్వెస్టర్లు.. అదరగొట్టిన డీ-మార్ట్

Mar 21 2017 11:57 AM | Updated on Sep 5 2017 6:42 AM

లక్కీ ఇన్వెస్టర్లు.. అదరగొట్టిన డీ-మార్ట్

లక్కీ ఇన్వెస్టర్లు.. అదరగొట్టిన డీ-మార్ట్

లిస్టింగ్ తొలిరోజే డీ-మార్ట్ అదరగొట్టింది.

ముంబై : లిస్టింగ్ తొలిరోజే డీ-మార్ట్ అదరగొట్టింది. డీ-మార్ట్ సూపర్ చెయిన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు బ్లాక్ బస్టర్ లిస్టింగ్ తో మంగళవారం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రిటైల్ చెయిన్ షేర్లు 106 శాతం పైకి ఎగిసి రూ.616.25 గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ షేర్ల ఇష్యూ ధర కేవలం రూ.299 మాత్రమే. దీంతో డీ-మార్ట్ షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రెండింతలు పెరిగింది. ఈ నెల మొదట్లో ఐపీఓకి వచ్చిన  డీ-మార్ట్ రూ.1870 కోట్ల నిధులను సమీకరించింది.
 
గతేడాది అక్టోబర్ లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత ఇదే అతిపెద్ద ఐపీఓ.   మార్నింగ్ సెషన్లో 104.8 శాతం పెరిగిన డీ-మార్ట్ మరింత పెరిగి రూ.615 గరిష్ట ధరను తాకింది. 2002లో మొదటిసారి ముంబైలో తొలి స్టోర్ ఇది ఏర్పాటుచేసింది. తర్వాత విస్తరించుకుంటూ వెళ్లిన డీ-మార్ట్ 2017 జనవరి 31 నాటి 118 అవులెట్లను ఏర్పాటుచేసింది. 2016 డిసెంబర్ నాటికి తొమ్మిది నెలల కాలవ్యవధిలో కంపెనీ మొత్తం రెవెన్యూలు రూ.8803 కోట్లగా నమోదయ్యాయి. నికర లాభాలు సైతం రూ.387.47 కోట్లగా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement