పై-లీన్ తుఫాను సహాయ కార్యక్రమాలన్నీ మరో నాలుగురోజుల్లో పూర్తవుతాయని ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది.
పై-లీన్ తుఫాను సహాయ కార్యక్రమాలన్నీ మరో నాలుగురోజుల్లో పూర్తవుతాయని ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలన్నింటి నుంచి నీరు లాగేసిందని, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారిలో చాలామంది తిరిగి తమ ఇళ్లకు వెళ్లారని ఒడిషా రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ పి.కె. మొహాపాత్ర తెలిపారు. ఈనెల 22వ తేదీకల్లా సహాయ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయన్నారు.
శనివారం రాత్రి గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన పై-లీన్ తుఫాను పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. గంజాం, పూరీ, గజపతి, ఖుర్దా జిల్లాలు ఈ తుఫాను వల్ల ఎక్కువగా దెబ్బతిన్నాయి. బాలాసోర్, భద్రక్, కియోంఝర్, మయూర్భంజ్, జాజ్పూర్ జిల్లాల్లో వరదలు వచ్చాయి. ఈ తుఫాను ప్రభావంతో 43 మంది మరణించగా 17 జిల్లాల్లోని 1.2 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.