రోడ్లను ఆక్రమించుకుని దుర్గాపూజలు చేసే రాజకీయ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారంటూ కలకత్తా హైకోర్టు మండిపడింది.
రోడ్లను ఆక్రమించుకుని దుర్గాపూజలు చేసే రాజకీయ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారంటూ కలకత్తా హైకోర్టు మండిపడింది. సెక్స్ వర్కర్ల సంఘం వాళ్లు సామూహిక పూజలు చేసుకుంటామంటే అవకాశం ఎందుకివ్వరో ఓ నివేదిక ఇవ్వాలని నగర పోలీసులను జస్టిస్ సంజీవ్ బెనర్జీ ఆదేశించారు.
దాదాపు 65 వేల మంది సెక్స్ వర్కర్లకు ప్రాతినిధ్యం వహించే దర్బార్ మహిళా సమన్వయ కమిటీ ఈ మేరకు దాఖలుచేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఉత్తర కోల్కతా నగరంలో సామూహిక పూజ చేసుకుంటామంటే అనుమతి ఇవ్వలేదని డీఎంఎస్సీ కోర్టుకెక్కింది. ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్న కారణంగా పోలీసులు వీరికి అనుమతి నిరాకరించారు. అయితే, నాయకులకు మాత్రం వీధులు ఆక్రమించి పూజలు చేసుకునే అనుమతి ఎందుకిచ్చారని జస్టిస్ బెనర్జీ ప్రశ్నించారు.