న్యాయస్థానంలోనే లంచం | Court of Justice in Bribery | Sakshi
Sakshi News home page

న్యాయస్థానంలోనే లంచం

Feb 12 2016 4:05 AM | Updated on Aug 17 2018 12:56 PM

సాక్షాత్తూ న్యాయస్థానంలోనే ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

మెదక్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన బెంచ్‌క్లర్క్
మెదక్: సాక్షాత్తూ న్యాయస్థానంలోనే ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో గురువారం సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన లాల్‌సింగ్‌కు సంబంధించి ఓ భూవివాదం(సివిల్) కేసు మెదక్‌లోని మూడో అదనపు జిల్లా కోర్టులో 2009 నుంచి కొనసాగుతోంది. కేసుకు సంబంధించి ప్రత్యర్థికి సమన్లు పంపించడానికి ఈ కోర్టులో దశాబ్దకాలంగా సూపరింటెండెంట్(బెంచ్ క్లర్క్)గా కాంట్రాక్టర్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటరమణారెడ్డి.. లాల్‌సింగ్‌ను రూ.5 వేల లంచం ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.

దీంతో లాల్‌సింగ్ మెదక్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లాల్‌సింగ్ నుంచి వెంకటరమణారెడ్డి లంచం తీసుకుంటుడగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నిందితున్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement