'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి' | Chandra bhah to be hanged, says PP rajan thakre | Sakshi
Sakshi News home page

'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'

Oct 28 2015 1:45 PM | Updated on Sep 3 2017 11:38 AM

'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'

'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'

సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీగా తేలిన చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనున్నారు.

ముంబై: తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీగా తేలిన చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ కేసులో శిక్ష విధింపుపై బుధవారం ముంబై కోర్టులో వాదనలు జరిగాయి. తుది తీర్పును 30కి వాయిదా వేసింది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే దాదాపు 80 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్  ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ముంబై కోర్టు చంద్రభాన్ను దోషీగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement