చంద్రబాబుకు స్వర పరీక్ష | cash for vote case: ACB may take Chandrababu voice samples | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు స్వర పరీక్ష

Sep 1 2016 1:50 AM | Updated on Aug 17 2018 12:56 PM

చంద్రబాబుకు స్వర పరీక్ష - Sakshi

చంద్రబాబుకు స్వర పరీక్ష

ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ వేగం పెంచింది. ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రపై దర్యాప్తు జరి పేందుకు గాను పూర్తిస్థాయిలో దృష్టిసారించింది.

- నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్న ఏసీబీ
- సెల్‌ఫోన్ రికార్డు వాయిస్ వాస్తవమైనదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ ల్యాబ్
- చంద్రబాబు నిరాకరిస్తే అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసుకునే యోచనలో ఏసీబీ


సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వేగం పెంచింది. ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పాత్రపై దర్యాప్తు జరి పేందుకు గాను పూర్తిస్థాయిలో దృష్టిసారించిం ది. అందులో భాగంగా చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయ డం కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో సీఎం బాబు పాత్రపై అనేక ఆధారాలు లభ్యమైన సంగతి తెల్సిందే. ఎమ్మెల్యేలతో ఫోన్‌లో చంద్రబాబు స్వయంగా బేరసారాలు నడిపినట్లు ఆడియో టేపులు వెలుగు చూశాయి.

నామినేటెడ్ ఎమ్మె ల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడిన వాయిస్‌పై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) గతంలోనే నివేదిక అందజేసింది. ఆ వాయిస్ నిజమైనదే అని, ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని స్పష్టం చేసిం ది. అందులో ఉన్న స్వరం ఏపీ సీఎం చంద్రబాబుదేనని తాజాగా ముంబైకి చెందిన ఒక ల్యాబ్ నివేదిక అందజేసింది. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు... చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని ఏసీబీ భావిస్తోంది. ప్రైవేటు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కేసు తీవ్రత దృష్ట్యా ఎఫ్‌ఎస్‌ఎల్ చేత మరోసారి పరీక్షలు జరిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోందని అధికారులు అంటున్నారు.

ఏడాది కిందటే చేయాలనుకున్న ఏసీబీ..
ఓటుకు కోట్లు కేసులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు స్వర పరీక్షలు జరిపించాలని ఏడాది కిందటే ఏసీబీ భావించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సీఎం చంద్రబాబు సాగించిన సంభాషణ మొత్తం వాస్తవమైనదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక నిర్ధారించింది. తర్వాత ఆ ఆడియో టేపులోని గొంతు చంద్రబాబు స్వరనమూనాతో సరిపోల్చేందుకు... స్వరపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్రవెంకట వీరయ్యల స్వర పరీక్షలు పూర్తి చేసింది. అసెంబ్లీ రికార్డుల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల వాయిస్ రికార్డులను, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బేరసారాలు సాగించిన ఫోన్ సంభాషణల వాయిస్ రికార్డును సరిపోల్చేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది. రెండింటి వాయిస్‌లు సరిపోలినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించింది. అలాగే చంద్రబాబు స్వరనమూనాలను కూడా పరీక్షలకు పంపి న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను ఉంచాలని భావించింది.

అయితే గత కొంతకాలంగా ఈకేసు నెమ్మదించింది. తాజాగా న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏసీబీ... చంద్రబాబుకు కూడా ఇపుడు స్వరపరీక్షను పూర్తి చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా చంద్రబాబుకు నోటీసులను పంపించాలని, వాటికి ఆయన స్పందించకపోతే ఆయన స్వరనమూనాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తీసుకోవాలని భావిస్తోంది. ఒక వేళ నోటీసులకు స్పందిస్తే గనుక ఆయన వద్దకెళ్లి తాజాగా స్వరనమూనాలను తీసుకొని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందజేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement