ఆ బర్గర్ ఖరీదు 10వేల డాలర్లు | Burger sells for $10,000 in Dubai | Sakshi
Sakshi News home page

ఆ బర్గర్ ఖరీదు 10వేల డాలర్లు

Mar 17 2017 1:24 PM | Updated on Sep 5 2017 6:21 AM

ఆ బర్గర్ ఖరీదు 10వేల డాలర్లు

ఆ బర్గర్ ఖరీదు 10వేల డాలర్లు

దుబాయ్ లో ఓ బర్గర్ ఏకంగా 10వేల డాలర్ల ఖరీదు పలికింది.

బర్గర్ ఖరీదు సాధారణంగా ఓ 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉండొచ్చు. కానీ దుబాయ్ లో ఓ బర్గర్ మాత్రం ఏకంగా 10వేల డాలర్ల ఖరీదు పలికింది. అంటే దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 6,55,505 అన్నమాట. జ్యూసీ బర్గర్ కోసం నిర్వహించిన చారిటీ ఆక్షన్ లో దుబాయ్ లైఫ్ స్టైల్ మ్యాగజీన్ విల్లా వ్యవస్థాపకుడు  అస్మా అల్ ఫహిమ్ 10వేల డాలర్లకు దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ బర్గర్ లో యూనిటెడ్ అరబ్ ఎమిరెట్స్ లోని ఏడు ఎమిరెట్స్ కు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏడు గొడ్డు మాంసం ముక్కులుంటాయి.
 
దీన్ని దుబాయ్ గాలెరీస్ లఫెట్టేకి చెందిన కలినరీ డైరెక్టర్ రస్సెల్ ఇంపియాజి, ఖత్తర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సభ్యుడు షేక్ మొహమ్మద్ బిన్ అబ్దులాహ్ అల్ థానీ తయారుచేశారు. రెండేళ్ల క్రితం నిర్వహించిన వేలంలో ఈ బర్గర్ 7వేల డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ ఏడాది దీన్ని ధర మరింత పెరిగింది. పింక్ క్యారవాన్ ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా సేకరించిన నగదును బెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి వాడుతుంటారు. ఈ బర్గర్ తో పాటు మరికొన్ని డిషెస్ కూడా వేలానికి వచ్చాయి. మొత్తంగా 29,633 డాలర్లను ఈ సంస్థ సేకరించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement