రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత | BSF seizes 12 kg heroin near Indo-Pak border | Sakshi
Sakshi News home page

రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

Oct 14 2015 1:11 PM | Updated on Sep 3 2017 10:57 AM

రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

భారత్ - పాక్ సరిహద్దుల్లో 12 కేజీల హెరాయిన్ను సీజ్ చేసినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు బుధవారం అమృతసర్లో వెల్లడించారు.

అమృతసర్: భారత్ - పాక్ సరిహద్దుల్లో 12 కేజీల హెరాయిన్ను సీజ్ చేసినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు బుధవారం అమృతసర్లో వెల్లడించారు.  సరిహద్దుల్లోని చిన్న బిద్ చంద్ సెక్టర్లోని పంటపోలాల్లో పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో ఈ హెరాయిన్ను కనుగొన్నట్లు తెలిపారు.  సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు రాత్రి పూట గస్తీ తిరుగుతున్న సమయంలో పాకిస్థానీయులు ఈ హెరాయిన్ వదలి వెళ్లారని చెప్పారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కానీ అయితే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 60 కోట్లు ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉద్దర్ దరీవాల సెక్టర్లో ఆరు కిలోల హెరాయిన్ పట్టికున్న సంగతి తెలిసిందే.  2015లో సరిహద్దు ప్రాంతంలో ఇప్పటివరకు 230 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో 1150 కోట్లు ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement