ఐదువేల ఏళ్లనాటి వృక్షం.. స్త్రీగా మారుతోంది! | Britain's oldest tree may be undergoing sex change | Sakshi
Sakshi News home page

ఐదువేల ఏళ్లనాటి వృక్షం.. స్త్రీగా మారుతోంది!

Nov 3 2015 11:30 AM | Updated on Jul 23 2018 9:11 PM

ఐదువేల ఏళ్లనాటి వృక్షం.. స్త్రీగా మారుతోంది! - Sakshi

ఐదువేల ఏళ్లనాటి వృక్షం.. స్త్రీగా మారుతోంది!

బ్రిటన్ లోనే అత్యధిక వయస్సు కలిగిన ఓ వృక్షం తనంతతానుగా లింగమార్పిడికి లోనవుతున్నది. దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఫార్టింగాల్ య్యూ వృక్షం.. పురుషుడి నుంచి స్త్రీగా పరిణామం చెందుతున్నది.

లండన్: బ్రిటన్ లోనే అత్యధిక వయస్సు కలిగిన ఓ వృక్షం తనంతతానుగా లింగమార్పిడికి లోనవుతున్నది. దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఫార్టింగాల్ య్యూ వృక్షం.. పురుషుడి నుంచి స్త్రీగా పరిణామం చెందుతున్నది. పెర్త్షైర్ లోని ఈ పురాతన చెట్టు పుప్పొడిని వెదజల్లేది. దీంతో దీనిని పురుష జాతి చెట్టుగా ఇన్నాళ్లు పరిశోధకులు భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవల స్త్రీ జాతి చెట్టు మాదిరిగా ఫార్టింగాల్ య్యూ కూడా విత్తనాలకు ఉపయోగపడే రెడ్ బెర్రీస్ గుత్తులను కాస్తున్నది.  య్యూ చెందిన ఓ కొమ్మకు ఇటీవల మూడు రెడ్ బెర్రీస్ గుత్తులను వృక్షశాస్త్రవేత్తలు గుర్తించారు. దీనినిబట్టి చెట్టులోని కొంతభాగం స్త్రీజాతిగా మారిందని నిర్ధారణకు వచ్చారు.

'య్యూలు మాములుగా పురుష లేదా స్త్రీ జాతి చెట్లుగా ఉండి..  శరత్కాలం, చలికాలంలో సులువుగా లైంగికోత్పత్తిలో పాల్గొంటాయి.  మగజాతి చెట్లు గుండ్రని ఆకృతిలో ఉండి.. పుప్పొడిని వెదజల్లుతుంటాయి. వాటి ఆధారంగా శరత్కాలం, చలికాలంలో స్త్రీ జాతి య్యూ చెట్లు రెడ్ బెర్రీస్ ను కాస్తాయి' అని రాయల్ బొటానిక్ గార్డెన్ ఎడిన్ బర్గ్ కు చెందిన శాస్త్రవేత్త మాక్స్ కొలెమన్ తెలిపారు. 'అయితే, ఫార్టింగాల్ య్యూకు అక్టోబర్ లో మూడు రెడ్ బెర్రీస్ గుత్తులు కాయడం నన్ను ఆశ్చర్యపరిచింది. చెట్టు మొత్తం మగజాతిగానే ఉండగా.. ఒక కొమ్మకు మాత్రమే కాశాయి. ఇది చాలా విచిత్రం. య్యూలు, ఇతర శంఖాకార వృక్షాలు ఇలా స్వయంగా లింగమార్పిడికి లోనవ్వడంలో గతంలో ఎప్పుడూ వినలేదు' అని ఆయన వివరించారు. య్యూ చెట్టుకు వెలుపలిభాగంలో కాసిన ఒక కొమ్మ మాత్రమే ఇలా స్త్రీజాతిగా పరిణామం చెంది బెర్రీస్ ను  కాస్తున్నదని ఆయన వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement