ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో బాంబు!

ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో బాంబు!


ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని హౌరా రైల్వేస్టేషన్లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు. రైల్లో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్లు దాన్ని తనిఖీ చేశారు.వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి, ఆ సిలిండర్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ దాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. స్టేషన్లో ఉన్న సమయంలో రైల్లో పేలుడు సంభవించి ఉంటే, నష్టం తీవ్రత ఎక్కువగానే ఉండేదని నిపుణులు అంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top