వ్యాపం కుంభకోణంలో ఉక్కిరిబిక్కిరయిన మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట. మధ్యప్రదేశ్ పురపాలక సంఘాల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.
భోపాల్: వ్యాపం కుంభకోణంలో ఉక్కిరిబిక్కిరయిన మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట. మధ్యప్రదేశ్ పురపాలక సంఘాల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని 16 మున్సిపల్ కార్పొరేషన్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఎంపీలో అన్నీ మున్సిపల్ కార్పొరేషన్లనూ బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఇది ప్రజల విజయమని, ఇతరులను అప్రతిష్టపాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వ్యాపం కుంభకోణంలో నైతిక బాధ్యత వహిస్తూ చౌహాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.