ఒమర్ అబ్దుల్లాతో కమలనాథుల చర్చలు | bjp leaders discuss with omar abdullah over formation of government | Sakshi
Sakshi News home page

ఒమర్ అబ్దుల్లాతో కమలనాథుల చర్చలు

Dec 25 2014 8:15 PM | Updated on Mar 29 2019 9:31 PM

జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ బీజేపీ పరిశీలిస్తోంది. ఇప్పుడు తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులతో కూడా చర్చలు సాగిస్తోంది.

జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ బీజేపీ పరిశీలిస్తోంది. ఇప్పుడు తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులతో కూడా చర్చలు సాగిస్తోంది. అందులో భాగంగా తాజా మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కమలనాథులు బుధవారం చర్చలు జరిపారు. బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలుండగా, బీజేపీ 25 స్థానాలు గెలుచుకుంది. పీడీపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ రెబెల్స్గా వివిధ పార్టీల తరఫున పోటీచేసి గెలిచిన ఆరుగురు ఎవరికైనా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలు గెలుచుకుంది. రెబెల్స్, బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ కలిస్తే.. ఈ బలం 46కు చేరుకుంటుంది.  ఈ లెక్కన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు.

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో పాటు పార్టీ జాతీయకార్యదర్శి అరుణ్ సింగ్ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు జమ్ము కాశ్మీర్కు పంపింది. అక్కడ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎన్నికకు వీరు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి, జమ్ము కాశ్మీర్ వ్యవహారాలను చూసుకున్న వారణాసి రాం మాధవ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement