రైతు భరోసా యాత్రను రేపటి నుంచి ప్రారంభించనున్నట్టు బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: రైతు భరోసా యాత్రను రేపటి నుంచి ప్రారంభించనున్నట్టు బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదంటూ? నాగం సూటిగా ప్రశ్నించారు.
రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం కక్ష కట్టినట్లుగా వ్యవహారిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరువుపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అమలు చేయాలని నాగం డిమాండ్ చేశారు.