గోవాలో బీచ్ పార్టీల జోష్ | Beach parties, church prayers mark New Year celebration in Goa | Sakshi
Sakshi News home page

గోవాలో బీచ్ పార్టీల జోష్

Jan 1 2014 10:18 AM | Updated on Oct 17 2018 4:29 PM

గోవాలో బీచ్ పార్టీల జోష్ - Sakshi

గోవాలో బీచ్ పార్టీల జోష్

మామూలుగానే గోవా అంటే పట్టుకోలేం. అలాంటిది న్యూ ఇయర్ అంటే ఇంక అసలు ఊరుకుంటారా? కొత్త సంవత్సరం సంబరాలతో గోవాలోని బీచ్లన్నీ దద్దరిల్లాయి.

మామూలుగానే గోవా అంటే పట్టుకోలేం. అలాంటిది న్యూ ఇయర్ అంటే ఇంక అసలు ఊరుకుంటారా? కొత్త సంవత్సరం సంబరాలతో గోవాలోని బీచ్లన్నీ దద్దరిల్లాయి. సముద్ర తీరాల్లో ఇసుక ఇంతెత్తున లేచింది. లక్షలాది మంది జనం అక్కడకు చేరుకుని బీచ్ పార్టీలతో రాత్రంతా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశారు. చర్చిల్లో కూడా అర్ధరాత్రి ప్రార్థనలు జరిగాయి. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని బీచ్లలోనూ ఎక్కడ చూసినా కింద ఇసుక కనిపించనంతగా జనం చేరారు. బుధవారం తెల్లవారుజాము వరకు కూడా ఈ సందడి కనిపించింది.

బాణాసంచా కాల్పులతో తీరప్రాంతాలు జిగేల్ జిగేల్మన్నాయి. కొత్త సంవత్సరం వేడుకల కోసమే దాదాపు మూడు లక్షల మందికి పైగా పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారని పర్యాటక శాఖ చెబుతోంది. శతాబ్దాల నాటి నాకియోనల్ క్లబ్బులాంటి చోట్ల డాన్స్ పార్టీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కూడా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement