ఆ డీల్ విలువ 4.42లక్షల కోట్లు | Bayer signs deal to acquire Monsanto for usd 66 billion | Sakshi
Sakshi News home page

ఆ డీల్ విలువ 4.42లక్షల కోట్లు

Sep 14 2016 6:22 PM | Updated on Apr 3 2019 8:42 PM

ఆ డీల్ విలువ 4.42లక్షల కోట్లు - Sakshi

ఆ డీల్ విలువ 4.42లక్షల కోట్లు

జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోన్ శాంటో 66 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.42 లక్షల కోట్లు) ఒప్పందం కుదిరింది.

జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోన్ శాంటో  డీల్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది.   విత్తనాలు, క్రిమిసంహారకాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్న బహుళజాతి దిగ్గజం  మోన్‌సాంటో విలీనానికి అంగీకరించినట్టు  బేయర్ తెలిపింది. 66 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.42 లక్షల కోట్లు)  ఈ ఒప్పందం జరిగినట్టు తెలిపింది.  దీంతో ప్రపంచ ఫర్టిలైజర్స్  పరిశ్రమలో అతిపెద్ద డీల్  కుదిరినట్టయింది. మాన్ శాంటో షేర్ హోల్డర్స్, యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్  ఆమోదంతో  ఈ విలీన ప్రక్రియ పూర్తికానుంది.

అన్ని నగదు పరిశీలనలో తమ వాటాదారుల అత్యధిక నిర్బంధిత విలువ ప్రాతినిధ్యం ఆధారంగా ఈ ఒప్పందం చేసుకున్నట్టు  మోన్ శాంటో  కంపెనీ ఛైర్మన్ ,  సీఈవో హ్యూ గ్రాంట్  ప్రకటించారు.  ప్రస్తుత మాన్ శాంటో ఉత్తర అమెరికన్ వ్యాపార ప్రధాన కార్యాలయం సెయింట్ లూయిస్, మిస్సోరి నుంచే తమ వ్యవసాయ ఆధార విత్తనాలు వ్యాపారాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు.

గతకొంతకాలంగా అమెరికా కేంద్రంగా ఉన్న మోన్‌సాంటోను చేజిక్కించుకునేందుకు  ప్రయత్నిస్తున్న బేయర్ సంస్థ ఒక్కో మాన్ శాంటో ఈక్విటీ షేరుకు  128 డాలర్లను అందించనుంది. గతంలో 122 డాలర్లను ఆఫర్ చేసిన సంస్థ చివరికి128 డాలర్లకు అంగీకారం తెలపడం విశేషం.    ఇది మే 9 నాటి  మాన్ శాంటో షేరుకు 44 శాతం ప్రీమియమని బేయర్ వర్గాలు వెల్లడించాయి.  మాండేటరీ కన్వర్టిబుల్ బాండ్, అండ్  రైట్స్ ఇష్యూ తో సహా రుణ ఈక్విటీ కింద 19 బిలియన్  డాలర్ల నగదును జారీ చేయనున్నట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement