స్వాప్‌తో 25 బిలియన్ డాలర్లు | Banks collect over $25 bn from special $ swap window: RBI | Sakshi
Sakshi News home page

స్వాప్‌తో 25 బిలియన్ డాలర్లు

Nov 26 2013 2:27 AM | Updated on Sep 2 2017 12:58 AM

స్వాప్‌తో 25 బిలియన్ డాలర్లు

స్వాప్‌తో 25 బిలియన్ డాలర్లు

స్వాప్ విండో ద్వారా బ్యాంకులు ఇప్పటి వరకూ 25 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ సోమవారం తెలిపారు.

ముంబై: స్వాప్ విండో ద్వారా బ్యాంకులు ఇప్పటి వరకూ 25 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ సోమవారం తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీ కరెన్సీ రుణాల ద్వారా ఈ మొత్తాన్ని బ్యాంకులు సమీకరించినట్లు తెలిపారు. రూపాయి బలోపేతానికి ప్రవేశపెట్టిన ఈ పథకం నవంబర్‌తో ముగియాల్సి ఉంది. అయితే దీనిని ఇటీవలే ఆర్‌బీఐ డిసెంబర్ వరకూ పొడిగించింది.  డిసెంబర్ చివరికల్లా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఇండెక్స్‌డ్ బాండ్లను ఆర్‌బీఐ ఆవిష్కరిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement