మనీలాండరింగ్‌కి అడ్డుకట్ట వేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది.
ముంబై: మనీలాండరింగ్‌కి అడ్డుకట్ట వేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. రూ. 50,000 దాకా విలువ చేసే చెక్కులకు మాత్రమే నగదు రూపంలో చెల్లింపులు జరపాలని, అంతకు మించితే నగదు చెల్లింపులు జరపరాదని గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులను ఆదేశించింది. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ వంటి నగదు బదిలీ సర్వీసులను బ్యాంకులు వినియోగించుకోవాలని ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో సూచించింది. మరోవైపు, కరస్పాండెంట్ బ్యాంకింగ్ ఒప్పందాల విషయంలో బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.