ఇటు బ్యాంకు డిపాజిట్లు, అటు బ్యాంకు రుణాలు గతేడాది కంటే బాగానే పెరిగాయట.
బ్యాంకు రుణాలు పెరిగిపోయాయ్
Jan 20 2017 7:07 PM | Updated on Sep 5 2017 1:42 AM
ఇటు బ్యాంకు డిపాజిట్లు, అటు బ్యాంకు రుణాలు గతేడాది కంటే బాగానే పెరిగాయట. జనవరి 6 వరకున్న రెండు వారాల కాలవ్యవధిలో బ్యాంకు రుణాలు గతేడాది కంటే 5.1 శాతం పెరిగినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. అదేవిధంగా డిపాజిట్లు సైతం 14.7 శాతం ఎగిసినట్టు సెంట్రల్ బ్యాంకు వీక్లి స్టాటిస్టికల్ సప్లిమెంట్లో శుక్రవారం పేర్కొంది.
అవుట్ స్టాండింగ్ రుణాలు సైతం రెండు వారాల కాలంలో రూ.65,360 కోట్ల నుంచి రూ.74.13 లక్షల కోట్లకు పెరిగినట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు డిపాజిట్లు కూడా రూ.67,930 కోట్ల నుంచి రూ.105.84 కోట్లకు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
Advertisement
Advertisement