శశికళ కాన్వాయ్‌ పై దాడి | attack on mk sasikala convoy | Sakshi
Sakshi News home page

శశికళ కాన్వాయ్‌ పై దాడి

Feb 15 2017 6:11 PM | Updated on Sep 5 2017 3:48 AM

అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ కాన్వాయ్‌ పై దాడి జరిగింది.

బెంగళూరు: అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ కాన్వాయ్‌ పై దాడి జరిగింది. కోర్టులో లొంగిపోయేందుకు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శశికళ బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాన్వాయ్‌ పై దాడికి పాల్పడ్డారు. వీరిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పన్నీర్‌ సెల్వం వర్గీయులే ఈ దాడికి పాల్పడివుంటారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు.

మరోవైపు కోర్టులో లొంగిపోయిన శశికళ న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement