రైలు ప్రమాదంలో 30 మంది మృతి | atleast 30 dead as trains derailed in madhya pradesh | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంలో 30 మంది మృతి

Aug 5 2015 7:14 AM | Updated on Oct 8 2018 3:36 PM

రైలు ప్రమాదంలో 30 మంది మృతి - Sakshi

రైలు ప్రమాదంలో 30 మంది మృతి

మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 30 మంది మరణించగా, ఇంకా చాలా మంది గాయపడ్డారు.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
పలువురు కొట్టుకుపోతుండగా చూశామన్న సాక్షులు
హర్దా: మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 30 మంది మరణించగా, ఇంకా చాలా మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు రైళ్లు పట్టాలు తప్పి నదిలో పడిపోయిన విషయం తెలిసిందే. 
 
మచక్ నది పొంగి పొర్లుతుండగా ఆ నీటిలో మునిగిపోయిన బ్రిడ్జిని దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడంతో పలువురు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికి తీశామని అధికారులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతను చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలామంది నీళ్లలో కొట్టుకుపోతుండటం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement