స్వయం ప్లాట్‌ఫాం, సంకల్ప్ శిక్షణ కేంద్రాలు | arun jaitley announces swayam platform and sankalp centres | Sakshi
Sakshi News home page

స్వయం ప్లాట్‌ఫాం, సంకల్ప్ శిక్షణ కేంద్రాలు

Feb 1 2017 11:48 AM | Updated on Aug 15 2018 2:30 PM

స్వయం ప్లాట్‌ఫాం, సంకల్ప్ శిక్షణ కేంద్రాలు - Sakshi

స్వయం ప్లాట్‌ఫాం, సంకల్ప్ శిక్షణ కేంద్రాలు

నాణ్యమైన విద్యతోనే యువతకు మేలు జరుగుతుందని అరుణ్ జైట్లీ అన్నారు. దానికోసం ఇన్నోవేషన్ ఫండ్ ను సృష్టిస్తామని, దీంతో లోకల్ ఇన్నోవేషన్ మొదలవుతుందని అన్నారు.

నాణ్యమైన విద్యతోనే యువతకు మేలు జరుగుతుందని అరుణ్ జైట్లీ అన్నారు. దానికోసం ఇన్నోవేషన్ ఫండ్ ను సృష్టిస్తామని, దీంతో లోకల్ ఇన్నోవేషన్ మొదలవుతుందని అన్నారు. ప్రధానంగా 3479 విద్యాపరంగా వెనకబడిన బ్లాకులపై దృష్టిపెడతామన్నారు. ఐటీ కోసం 'స్వయం' ప్లాట్‌ఫాం ఏర్పాటుచేస్తామని విద్యార్థులు వర్చువల్ క్లాసుల ద్వారా నేర్చుకోవచ్చని, ఆన్‌లైన్ టెస్టులలో పాల్గొనవచ్చని, డీటీహెచ్ చానళ్ల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రవేశపరీక్షల నిర్వహణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేస్తామన్నారు. 
 
స్కిల్ ఇండియా మిషన్‌ను గతంలో ఏర్పాటుచేశామని ఇప్పుడు దేశంలో 600 కేంద్రాల్లో దీన్ని అమలుచేస్తామని తెలిపారు. వీటిలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్, విదేశీ భాషల్లో శిక్షణ కూడా ఇస్తారని, వీటివల్ల విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వీటి కోసం రూ. 4వేల కోట్లతో సంకల్ప్ కేంద్రాలు పెడతామని అన్నారు. 500 కోట్లతో మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తామని, దీనివల్ల గ్రామీణ మహిళలు ఉపాధి అవకాశాలను పెంచుకుంటారని చెప్పారు. మహిళాభివృద్ధికి నిధుల కేటాయింపును 1,56,528 కోట్ల నుంచి 1,84,632 కోట్లకు పెంచుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement