జస్టిస్ ఏకే గంగూలీ మాదిరే న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో సుప్రీం కోర్టు మాజీ జడ్జి పేరు బయటకొచ్చింది.
లైంగిక వేధింపుల ఉదంతంలో వెలుగులోకి..
న్యూఢిల్లీ: జస్టిస్ ఏకే గంగూలీ మాదిరే న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో సుప్రీం కోర్టు మాజీ జడ్జి పేరు బయటకొచ్చింది. ఆయన ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ స్వతంత్ర కుమార్ అని తేలింది. బాధితురాలి ఫిర్యాదును ఉటంకిస్తూ సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ శుక్రవారం ఈమేరకు వెల్లడించింది. జస్టిస్ గంగూలీపై వచ్చినట్లే మరో సుప్రీం కోర్టు మాజీ జడ్జిపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని ‘సాక్షి’లో ఇటీవల వార్త రావడం తెలిసిందే.